అక్షరటుడే, వెబ్డెస్క్: Railway Minister | భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw) ప్రకటించారు. మొదటి రైలు కోల్కతా నుంచి గౌహతి వరకు నడుస్తుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం (West Bengal and Assam) మధ్య సాగే ఈ రైలు సేవలు విమాన టికెట్ల ధరల కంటే చాలా తక్కువ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు.
Railway Minister | రానున్న 20 రోజుల్లో..
రానున్న 20 రోజుల్లో వందే భారత్ స్లీపర్ రైలు సేవలు (Vande Bharat sleeper train services) ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి తెలిపారు. జనవరి 18 నుంచి 19 తేదీల మధ్య ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవం గురించి ప్రధానికి సమాచారం అందించామని చెప్పారు. రానున్న 2-3 రోజుల్లో ప్రారంభ తేదీల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం కోల్కతా మరియు గౌహతి మధ్య విమాన ప్రయాణానికి రూ.6వేల నుంచి రూ.8 వేలు వరకు ఖర్చు అవుతోందని చెప్పారు. అదే వందేభారత్ స్లీపర్ రైలులో 3 టైర్ ఏసీలో ఆహారంతో సహా ఒక ప్రయాణికుడికి రూ.2,300, 2 టైర్ ఏసీకి రూ.3వేలు, 1 టైర్ ఏసీకి రూ.3,600 వరకు ఛార్జీలు ఉండవచ్చని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.