ePaper
More
    Homeటెక్నాలజీGoogle Pixel 9 | ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 9 ధర...

    Google Pixel 9 | ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Google Pixel 9 | గూగుల్ కు చెందిన స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 9 ధర భారీ తగపోయింది. ఆగస్టు 21న గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ (Google Pixel 10 series) ఇండియాలో లాంచ్ అయిన తర్వాత పిక్సెల్ 9 ధర గణనీయంగా తగ్గింది.

    గూగుల్ పిక్సెల్ 10, 10 ప్రో, 10 ఎక్స్ఎల్, 10 ప్రో ఫోల్డ్లను కలిగి ఉన్న కొత్త సిరీస్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పిక్సెల్ 9 రేట్ భారీగా తగ్గించింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్లతో పిక్సెల్ 9 సిరీస్ ఇప్పుడు గతంలో కంటే సరసమైన ధరలో అందుబాటులోకి వచ్చింది.

    Google Pixel 9 | డిస్కౌంట్ ఎంతంటే..

    12GB RAM, 256GB స్టోరేజ్తో ఉన్న గూగుల్ పిక్సెల్ 9 ప్రస్తుతం అమెజాన్లో రూ.58,800కి అందుబాటులో ఉంది. ఆగస్టు వరకు లాంచ్ ధర అయిన రూ.79,999 ఉండేది. అయితే, 10 సిరీస్ మార్కెట్ లోకి రావడంతో ప్రస్తుతం తగ్గింపు ధరలకే విక్రయిస్తోంది. ఇక, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని (Credit Card) ఉపయోగించడం ద్వారా రూ.1,500 అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు, దీని వలన తుది ధర రూ.57,300కి తగ్గుతుంది. ఈ లెక్కన ఫోన్ లాంచ్ ధర కంటే రూ.22,699 చౌకగా లభిస్తుందన్న మాట. అమెజాన్ గరిష్టంగా రూ.47,150 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా అందిస్తోంది.

    Google Pixel 9 | స్పెసిఫికేషన్లు

    గూగుల్ పిక్సెల్9 (Google Pixel 9) అధునాతన ఫీచర్లు కలిగింది. 6.3-అంగుళాల Actua OLED డిస్ ప్లే, టెన్సర్ G4 ప్రాసెసర్, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు 4700mAh బ్యాటరీ కలిగి ఉంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, Qi-సర్టిఫైడ్ వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లో బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా అమర్చారు.

    గతేడాదిలో విడుదలైన Google Pixel 9 Pro ధర భారీగా ధర తగ్గిపోయింది. వాస్తవానికి దీని లాంచింగ్ ధర రూ.1,09,999, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రూ.20,000 తగ్గింపు కారణంగా రూ.89,999కి అందుబాటులో ఉంది. ఇది తాజా స్మార్ట్ఫోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారికి మరింత సరసమైన ఎంపికగా చేస్తుంది.

    More like this

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...

    corrupt revenue inspector | ఆ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మామూలోడు కాదు..

    అక్షరటుడే, ఇందూరు : corrupt revenue inspector | అవినీతికి కేరాఫ్​ అడ్రస్​గా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగి.....

    GST slabs | వినియోగదారులకు గుడ్​న్యూస్​.. జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. ఎప్పటి నుంచి అమలు అంటే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST slabs | వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. 79వ స్వాతంత్య్ర...