ePaper
More
    HomeతెలంగాణEPFO | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలు డ్రా చేసుకునే అవకాశం

    EPFO | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలు డ్రా చేసుకునే అవకాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: EPFO | లక్షలాది మంది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organization) గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెంచడంతో సభ్యులు ఇక నుంచి రూ. 5 లక్షల వరకు తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. ఇప్పటివరకు రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తాల ముందస్తు ఉపసంహరణ కోసం సభ్యులు మాన్యువల్ వెరిఫికేషన్(Manual Verification) కోసం వేచి చూడాల్సి వచ్చేది. లక్షలాది మందికి భారీ ఉపశమనం కల్పిస్తూ అడ్వాన్స్ క్లెయిమ్స్​ (ASAC) కోసం ఆటో-సెటిల్మెంట్ పరిమితిని ఈపీఎఫ్​వో రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ఇది ముఖ్యంగా అత్యవసర సమయాల్లో త్వరగా నిధుల యాక్సెస్​ను సులభతరం చేస్తుంది. ఈపీఎఫ్​వో తాజా విధాన నిర్ణయం మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండా మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. సభ్యులకు త్వరిత ఆర్థిక సహాయం అందించడానికి మహమ్మారి సమయంలో EPFO మొదట అడ్వాన్స్ క్లెయిమ్​ల ఆటో-సెటిల్మెంట్​ను ప్రవేశపెట్టింది.

    ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెరుగుదలతో సభ్యులు రూ. 5 లక్షల వరకు తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. ఇప్పటివరకు, రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తాల ముందస్తు విత్ డ్రా కోసం మాన్యువల్ వెరిఫికేషన్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. నాన్-ఆటో సెటిల్మెంట్​కు ఈపీఎఫ్​వో చందాదారులు EPFO కార్యాలయాలను సందర్శించి మాన్యువల్ ఆమోదం పొందాల్సి ఉండేది. ఇది చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈపీఎఫ్​వో దీన్ని సవరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(Central Board of Trustees Executive Committee) గత మార్చి నెలలో ASAC పరిమితిని రూ. 5 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఆమోదించింది. అంతకు ముందు ASAC పరిమితి రూ.50 వేలు ఉండగా, 2024 మేలో దాన్ని రూ. లక్షకు పెంచారు. FY24లో దాదాపు 9 మిలియన్ల మేర ఆటో-సెటిల్మెంట్ క్లెయిమ్​లు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 మిలియన్లకు చేరాయి.

    Latest articles

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    More like this