ePaper
More
    HomeతెలంగాణWhatsApp Grievance | ప్రజలకు గుడ్​న్యూస్​.. ఇక వాట్సాప్​లో ఫిర్యాదు చేయొచ్చు

    WhatsApp Grievance | ప్రజలకు గుడ్​న్యూస్​.. ఇక వాట్సాప్​లో ఫిర్యాదు చేయొచ్చు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: WhatsApp Grievance | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రజలకు గుడ్​ న్యూస్​ చెప్పింది. హైదరాబాద్​ జిల్లాలో ప్రజల నుంచి వాట్సాప్​ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. వాట్సాప్​ గ్రీవెన్స్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండానే తమ సమస్యలపై వాట్సాప్​ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

    ప్రస్తుతం ప్రజలు ఏదైనా సమస్య ఉంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి. అధికారులకు వినతి పత్రం అందించాలి. దీంతో చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరిగలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే ప్రజావాణి ద్వారా కూడా ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే కార్యాలయాలకు రాలేని వారి కోసం ప్రభుత్వం వాట్సాప్​ గ్రీవెన్స్(WhatsApp Grievance)​​ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

    WhatsApp Grievance | హైదరాబాద్​ నగరంలో..

    వాట్సాప్​ గ్రీవెన్స్​ సేవలు మొదట హైదరాబాద్(Hyderabad) నగరంలో అందుబాటులోకి వచ్చాయి. సోమవారం నుంచి ఈ సేవలు అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలను వెళ్లకుండానే 7416687878 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని ఆమె తెలిపారు.

    READ ALSO  TGS RTC | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో భారీగా బస్సు ఛార్జీల తగ్గింపు

    వాట్సాప్​లో ఫిర్యాదు చేయగానే.. యూనిక్​ ఐడీ(Unique ID) ఇస్తారు. వాట్సాప్​లోనే అక్నాలెడ్జ్​మెంట్​ పంపుతారు. అనంతరం సదరు సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపిస్తారు. అనంతరం సదరు ఫిర్యాదుపై చేపట్టిన చర్యలను కూడా వాట్సాప్​లో ఫిర్యాదుదారుడికి పంపుతారు. ప్రజావాణి(Prajavani)కి రాలేని ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులకు వాట్సాప్ గ్రీవెన్స్ ఫెసిలిటీ ఎంతో ఉపయోగ పడుతుందని కలెక్టర్(Collector)​ తెలిపారు.

    Latest articles

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...

    Meenakshi Natarajan padayatra | మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

    అక్షరటుడే, ఆర్మూర్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్​...

    More like this