HomeUncategorizedVande Bharat | ప్రయాణికులకు గుడ్​న్యూస్.. ‘వందే భారత్​’లో బోగీలు డబుల్​

Vande Bharat | ప్రయాణికులకు గుడ్​న్యూస్.. ‘వందే భారత్​’లో బోగీలు డబుల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vande Bharat | కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన ప్రయాణం కోసం వందే భారత్​ రైళ్లను (Vande Bharat trains) అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సౌకర్యాలను ఈ రైళ్లలో సమకూర్చింది. రద్దీ అధికంగా ఉండే పెద్ద నగరాల మధ్య ప్రస్తుతం వీటిని నడుపుతోంది. అయితే పలు మార్గాల్లో వందే భారత్​ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. దీంతో రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్​ రైళ్లలో బోగీలు పెంచాలని నిర్ణయించింది.

హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు (Hyderabad to Bangalore) నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తారు. దీంతో హైదరాబాద్​లోని కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్​పూరకు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వందే భారత్​ రైలును నడుపుతోంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 2023 సెప్టెంబర్‌ 28న వర్చువల్​గా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ట్రైన్​ ఎనిమిది బోగీలతో 530 మంది సిటింగ్‌ సామర్థ్యంతో సర్వీసులందిస్తోంది. అయితే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో వందేభారత్​లో సీట్లకు డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ బోగీల సంఖ్యను డబుల్​ చేయాలని నిర్ణయించింది. జులై 10 నుంచి ఈ మార్గంలో వందే భారత్​ 16 కోచ్​లతో నడవనుంది.

Vande Bharat | డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో..

కాచిగూడ–యశ్వంత్​పుర–కాచిగూడ మార్గంలో వందే భారత్​కు డిమాండ్​ అధికంగా ఉంది. అంతేగాకుండా వందశాతం ఆక్యూపెన్సీ నమోదవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 8 బోగీలను 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. ప్రస్తుతం 530 మంది వెళ్లే అవకాశం ఉండగా బోగీల పెంపుతో ప్రయాణికుల సీటింగ్​ సామర్థ్యం 1,128 కు పెరగనుంది. కాగా జులై 10 నుంచి 14 చైర్ కార్లు కోచ్​లు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో ఈ మార్గంలో వందే భారత్​ రైలు నడవనుంది.

కోచ్​లు డబుల్​ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది. బుధవారం మినహా మిగతా రోజుల్లో సేవలు అందిస్తోంది. కాచిగూడ నుంచి యశ్వంత్​పురకు (Kacheguda to Yeshwantpur) 612 కిలోమీటర్ల దూరం ఉండగా.. 8 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. మధ్యలో నాలుగు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మహబూబ్​నగర్, కర్నూల్​ సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలలో వందేభారత్​కు స్టాప్​ ఉంది.

Must Read
Related News