ePaper
More
    HomeజాతీయంRailway Passengers | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. బెంగళూరుకు మరో వీక్లీ ఎక్స్​ప్రెస్​

    Railway Passengers | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. బెంగళూరుకు మరో వీక్లీ ఎక్స్​ప్రెస్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Railway Passengers | తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువ మంది రైళ్లద్వారానే రాకపోకలు సాగిస్తారు. దీంతో బెంగళూరు(Bangalore) మార్గంలో నడిచే ట్రైన్లలో అధిక రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ ప్రయణికులకు(Railway Passengers) గుడ్​ న్యూస్​ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది.

    మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని గ్వాలియర్​ నుంచి బెంగళూరుకు ప్రత్యేక రైలును గురువారం అధికారులు ప్రారంభించారు. ఈ రైలు గ్వాలియర్​ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​మీదుగా బెంగళూరులోని సర్​ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్(Visvesvaraya Terminal)​కు చేరుకుంటుంది. రెగ్యులర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుగా ఈ 29 నుంచి రైలు అందుబాటులోకి రానుంది. బెంగళూరు నుంచి 29న రైలు ప్రారంభం కానుంది.

    Railway Passengers | కేంద్ర మంత్రి చొరవతో..

    కేంద్ర సమాచార శాఖ మంత్రి, గుణ బీజేపీ లోక్​సభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా(MP Jyotiraditya Scindia) కృషితో ఈ రైలు మంజూరు అయింది. ఆయన నియోజకవర్గం పరిధిలోని మూడు ప్రముఖ స్టేషన్లలో ఈ ట్రెయిన్​ ఆగుతుంది. ఉత్తర మధ్య రైల్వే జోన్ ఝాన్సీ డివిజన్(Jhansi Division)​ ఆధ్వర్యంలో దీనిని నడుపుతున్నారు. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ గ్వాలియర్ కోచింగ్ డిపోలో నిర్వహిస్తారు.

    Railway Passengers | తెలంగాణలో ఎక్కడ ఆగుతుందంటే..

    గ్వాలియర్​ – బెంగళూరు రైలు తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతుంది. దీంతో ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. గద్వాల, మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్​లలో ఈ రైలుకు స్టాప్ సదుపాయం కల్పించారు. బెంగళూరు వెళ్లేటప్పుడు ఈ ట్రెయిన్​ కాచిగూడ రైల్వే స్టేషన్(Kacheguda Railway Station) కి ప్రతి శనివారం 5:20 నిమిషాలకు వచ్చి 5:30 నిమిషాలకు బయలుదేరుతుంది. గ్వాలియర్​ వెళ్లేటప్పుడు ప్రతి సోమవారం ఉదయం 03:25 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్​కు చేరుకుంటుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...