అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sankranti Special Trains | సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. హైదరాబాద్ (Hyderabad)లో నివాసం ఉంటున్న ఏపీ వారు రైళ్లు, బస్సుల్లో స్వగ్రామాలకు వెళ్తున్నారు.
ఏపీ (Andhra Pradesh)లో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు సందడి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఎంతో మంది ఏపీవాసులు నివాసం ఉంటున్నారు. వీరంతా పండుగకు వెళ్తున్నారు. దీంతో రైళ్లలో టికెట్లన్నీ ఫూల్ అయ్యాయి. ఆర్టీసీ బస్సులు కూడా సరిపోవడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పండుగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతామని తెలిపింది.
Sankranti Special Trains | హైదరాబాద్–విజయవాడ మధ్య..
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పండగకు ముందు, తర్వాత ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. జనవరి 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు విజయవాడకు వెళ్తుంది. 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ ప్రత్యేక రైళ్లు హైదరాబాద్‌కు స్టార్ట్ అవుతాయి. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. రైలులో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో రిజర్వేషన్ చేసుకొని వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.