HomeUncategorizedFastag | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.3 వేలకే ఏడాదంతా ఎక్కడైనా...

Fastag | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.3 వేలకే ఏడాదంతా ఎక్కడైనా తిరుగొచ్చు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Fastag | వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్​(Fastag)పై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. రూ.3వేలు చెల్లిస్తే ఏడాదంతా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వాహనదారులకు టోల్​ (Toll charges) భారం చాలా వరకు తగ్గనుంది. రూ.3వేలు చెల్లిస్తే ఏడాదిలో 200 ట్రిప్పుల ప్రయాణం పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది

Fastag | తగ్గనున్న భారం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులపై టోల్​ భారం తగ్గనుంది. దేశంలోని హైవేలు (highway tolls), ఎక్స్ ప్రెస్​ వే (expressways tolls) నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై టోల్​ ఛార్జీల (Toll charges) భారం ఎక్కువగా పడుతుందని కేంద్ర ప్రభుత్వం (Central Government) భావించింది. దీంతో ప్రయాణికులపై టోల్​ భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాది వార్షిక పాసులను తీసుకోవడం ద్వారా ఏడాదంతా 200 ట్రిప్పుల వరకు ఎక్కడైనా ప్రయాణించే అవకాశం లభించనుంది.

Fastg | అన్ని హైవేలపై వర్తింపు

కొత్త ఫాస్టాగ్ (Fastag pass)​ విధానంలో దేశంలోని అన్ని జాతీయ రహదారులతో పాటు రాష్ట్రాల అధీనంలో ఉండే ఎక్స్ ప్రెస్​ దారులపైనా చెల్లుబాటు కానుంది. ప్రస్తుతం నెలవారీ పాస్​లు మాత్రమే జారీ చేస్తున్నారు. కొత్త పాలసీ అమల్లోకి వస్తే ఏడాది కాలానికి పాస్​లు ఇస్తారు.