అక్షరటుడే, ఇందూరు : Lab Technicians | మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ (Medical and Health Employees) రిక్రూట్ మెంట్ బోర్డు కింద 2024లో ల్యాబ్ టెక్నీషియన్ల నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదిలో ఉద్యోగాలు సాధించిన వారికి ఆర్డర్ కాపీలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
Lab Technicians | ప్రజాభవన్‌కు తరలివెళ్లిన ల్యాబ్ టెక్నీషియన్లు..
తమకు నియామకపత్రాలు అందజేయాలని కోరుతూ ఎంహెచ్ఎస్ఆర్బీ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజాభవన్ (Praja Bhavan)కు తరలివెళ్లారు. అక్కడ సీఎంవో చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వారం రోజుల్లోగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహా (Damodara Rajanarasimha) ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.