అక్షరటుడే, వెబ్‌డెస్క్: JL Promotions | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
పలువురు లెక్చరర్లకు ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఆయా కాలేజీల్లో ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రిన్సిపాళ్లు లేరు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా 81 కాలేజీలకు ప్రిన్సిపాళ్లను నియమించాలని నిర్ణయించింది.
ఈ మేరకు 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్ కల్పించింది. వీరికి సోమవారం నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నూతన స్థానాల్లో పోస్టింగు ఇవ్వనున్నారు.
కాగా.. పదోన్నతి అనంతరం ఏర్పడిన ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేసే అవకాశం ఉంది. అనంతరం రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే ఉద్దేశంతో సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.