Homeబిజినెస్​TCS | ఐటీ ఫ్రెషర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భారీ ప్యాకేజీలతో టీసీఎస్‌ సిద్ధం

TCS | ఐటీ ఫ్రెషర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భారీ ప్యాకేజీలతో టీసీఎస్‌ సిద్ధం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :TCS | దేశీయ టెక్‌ దిగ్గజ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (Tata Consultancy Services) ఐటీ ఫ్రెషర్స్‌ కోసం నియామక ప్రక్రియ కొనసాగిస్తోంది.

ప్రతిభావంతులైన యువతను ఆకర్షించేందుకు మూడు కేటగిరిలలో నియామకాలు చేపడుతోంది. నింజా, డిజిటల్‌, ప్రైమ్‌ కేటగిరీలలో వివిధ వేతన ప్యాకేజీల(Packages)తో ఈ ప్రక్రియ సాగనుంది. ఇందుకోసం టీసీఎస్‌ ఎన్‌క్యూటీ(నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌) 2025 పేరుతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుంది. ఆసక్తి గల వారు టీసీఎస్‌ నెక్స్ట్‌ స్టెప్‌ పోర్టల్‌(Next step portal) ద్వారా రిజస్టర్‌ చేసుకుని, ఐటీ కేటగిరిని ఎంచుకుని అప్లికేషన్‌ పూరించాలి. పూర్తి వివరాలకోసం టీసీఎస్‌(TCS) అధికారిక కెరీర్స్‌ పేజీని సంప్రదించండి.

TCS | వేతన ప్యాకేజీల వివరాలు..

మూడు కేటగిరీ(Catagory)లలో నియామకాలు చేపడుతున్నారు. నింజా, డిజిటల్‌, ప్రైమ్‌ విభాగాలలో ఎంపిక ప్రక్రియ సాగుతుంది. వేతన ప్యాకేజీలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలున్నాయి.

నింజా:Ninjaలో ఎంపికైనవారికి సంవత్సరానికి రూ. 3.36 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఇది ఎంట్రీ లెవల్‌ టెక్నికల్‌ రోల్స్‌ కోసం ఉద్దేశించిన విభాగం.

డిజిటల్‌:Digital విభాగంలో ఎంపికైనవారికి సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు వేతనం అందే అవకాశాలున్నాయి. ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చెయిన్‌లాంటి రంగాలకు సంబంధించినది.

ప్రైమ్‌:Prime కేటగిరిలో సంవత్సరానికి రూ. 9 లక్షలనుంచి రూ. 11.5 లక్షల వరకు వేతనం ఉంటుంది. అత్యున్నత నైపుణ్యాలు కలిగినవారికి ఉద్దేశించిన విభాగమిది.

ఎవరు అర్హులంటే:2023 నుంచి 2025 వరకు బీఈ(BE), బీటెక్‌, ఎంసీఏ, బీకాం, బీఏ, బీఏఎఫ్‌, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ-ఐటీ/సీఎస్‌, బీసీఏ, బీసీఎస్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు చేసినవారు అర్హులు. ఎడ్యుకేషన్‌లో 24 నెలలకుమించి గ్యాప్‌ ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:ఆన్‌లైన్‌ టెస్ట్‌(Online test)తోపాటు ఇంటర్వ్యూలు నిర్వహించిన ఎంపిక చేస్తారు. వచ్చేనెల 6వ తేదీన ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.