అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Holidays | 2026 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి స్టాక్ మార్కెట్ సెలవుల జాబితాను బీఎస్ఈ(BSE), ఎన్ఎస్ఈ విడుదల చేశాయి. పందొమ్మిది పర్వదినాల సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవులు రానున్నాయి. ప్రతివారంలో వచ్చే శని, ఆదివారాలు వీటికి అదనం. ఆయా రోజుల్లో ఈక్విటీ ట్రేడిరగ్(Equity trading), డెరివేటివ్స్, సెక్యూరిటీస్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే మహా శివరాత్రి(Maha Shivaratri), ఈద్-ఉల్-ఫితర్, స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day), దీపావళి లక్ష్మీపూజలు శని, ఆదివారాల్లో వస్తున్నాయి. దీంతో ఆ మేరకు సెలవుల సంఖ్య 15 కు తగ్గనుంది. వచ్చే క్యాలెండర్ ఇయర్((Calendar year)లో వచ్చే సెలవుల వివరాలిలా ఉన్నాయి.
జూలై నెలలో ఒక్క రోజు కూడా సెలవు లేదు. కాగా మార్చి(March) నెలలో నాలుగు రోజులు, నవంబర్‌లో మూడు రోజులు, ఏప్రిల్, మే, అక్టోబర్ నెలల్లో రెండు చొప్పున, మిగతా నెలల్లో ఒక్కొక్కటి సెలవులు రానున్నాయి.
జనవరి 26 : రిపబ్లిక్ డే.
ఫిబ్రవరి 15(ఆదివారం) : మహా శివరాత్రి.
మార్చి 3 : హోలీ(Holi).
మార్చి 21(శనివారం) : ఈద్-ఉల్-ఫితర్
మార్చి 26 : శ్రీరామ నవమి.
మార్చి 31 : మహవీర్ జయంతి.
ఏప్రిల్ 3 : గుడ్‌ఫ్రైడే.
ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి.
మే 1 : మహారాష్ట్ర డే.
మే 28 : బక్రీద్.
జూన్ 26 : మొహర్రం.
ఆగస్టు 15(శనివారం) : స్వాతంత్య్ర దినోత్సవం.
సెప్టెంబర్ 14 : వినాయక చవితి.
అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 20 : దసరా.
నవంబర్ 8(ఆదివారం) :దీపావళి లక్ష్మీపూజ.
నవంబర్ 10 : దీపావళి బలిప్రతిపద.
నవంబర్ 24 : గురునానక్ జయంతి.
డిసెంబర్ 25 : క్రిస్మస్.