HomeUncategorizedInfosys Employees | ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 80 శాతం బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం

Infosys Employees | ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 80 శాతం బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Infosys Employees | దేశీయ టెక్‌ దిగ్గజం సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) తన ఉద్యోగులకు (Employee) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి బోనస్‌ (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. సగటున 80 శాతం బోనస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 65 శాతమే కావడం గమనార్హం.

ఉద్యోగుల రేటింగ్‌, స్థాయి ఆధారంగా వేర్వేరుగా బోనస్‌ ఇవ్వనుంది. PL4 స్థాయిలో Out standing రేటింగ్‌ సాధించినవారికి 89 శాతం బోనస్‌ ఇవ్వనున్నారు. నీడ్స్‌ అటెన్షన్‌ కేటగిరిలో ఉన్నవారికి 80 శాతం బోనస్‌ అందనుంది. పీఎల్‌5 స్థాయివారికి 78 నుంచి 87 శాతం వరకు బోనస్‌ లభించనుంది. పీఎల్‌6 స్థాయి ఉద్యోగులకు 75 నుంచి 85 శాతం వరకు బోనస్‌ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ బోనస్‌లు ప్రధానంగా బ్యాండ్‌ 6 అంతకంటే తక్కువ స్థాయిలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తాయని పేర్కొంది. అంటే కంపెనీలోని జూనియర్‌(Junior) నుంచి మిడ్‌లెవెల్‌ వరకు ఉద్యోగులకు బోనస్‌ వర్తించనుంది. బోనస్‌ గురించిన వివరాలను ఇప్పటికే ఉద్యోగులకు పంపినట్లు తెలుస్తోంది. మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 42,279 కోట్ల ఆదాయం(Revenue) ఆర్జించడం ద్వారా రూ. 6,921 కోట్ల నికర లాభం(Net profit) పొందింది. ఊహించిన దానికంటే ఉత్తమ పనితీరు కనబరిచిన కంపెనీ.. ఇప్పుడు ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది.

దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS) తన సిబ్బందికి వేతన పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. అది వచ్చేనెల ఒకటో తేదీనుంచి అమలులోకి రానుంది.

Must Read
Related News