HomeUncategorizedUS Student Visa | భార‌తీయ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. అమెరికా స్టూడెంట్ వీసాల జారీ...

US Student Visa | భార‌తీయ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. అమెరికా స్టూడెంట్ వీసాల జారీ షురూ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Student Visa | అగ్ర‌రాజ్యంలో చ‌ద‌వాల‌ని క‌ల‌గంటున్న విదేశీ విద్యార్థుల‌కు అమెరికా (America) శుభ‌వార్త తెలిపింది. ఇటీవ‌ల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసాల (Student Visa) జారీ ప్ర‌క్రియ‌ను తిరిగి ప్రారంభించింది. విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ పౌరులకు గతంలో నిలిపివేసిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. అయితే మెరుగైన భద్రతా చర్యలలో భాగంగా వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థుల సోష‌ల్ మీడియా (Social Media) ఖాతాల‌ను త‌ప్ప‌నిస‌రిగా చెక్ చేస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు దరఖాస్తుదారులందరూ అధికారిక సమీక్ష కోసం వారి సోషల్ మీడియా ఖాతాలకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

US Student Visa | “సోష‌ల్” పోస్టులే కీల‌కం

అమెరికా వీసా జారీ చేసేందుకు విద్యార్థి గ‌త చ‌రిత్ర‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌నుంది. ఈ మేర‌కు గ‌తంలో సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టుల‌ను త‌నిఖీ చేయ‌నుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. అమెరికా ప్రభుత్వం, సాంస్కృతిక విలువలు, సంస్థలు లేదా వ్యవస్థాపక సూత్రాలకు వ్యతిరేకంగా ప్రతికూలంగా భావించే ఏవైనా పోస్ట్‌లు లేదా సందేశాల కోసం కాన్సులర్ అధికారులు దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. సోషల్ మీడియా వెట్టింగ్‌తో అమెరికాలో వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించే ప్ర‌తి వ్య‌క్తిని పూర్తిగా ప‌రిశీలించేందుకు వీలు ల‌భిస్తుందని, వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ప్ర‌తి విద్యార్థి సామాజిక మాధ్య‌మాల‌ను యూఎస్ కాన్సుల‌ర్ అధికారులు క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తార‌ని తెలిపింది. ఇందుకోసం ద‌ర‌ఖాస్తుదారులు త‌మ సోష‌ల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేట్ సెట్టింగ్‌ను మార్చుకుని ప‌బ్లిక్ ఆప్ష‌న్ పెట్టుకోవాల‌ని సూచించింది.

US Student Visa | క‌ఠిన నిబంధ‌న‌లు

భ‌ద్ర‌తా చర్య‌ల నేప‌థ్యంలో భాగంగా అమెరికా మే నెలలో విద్యార్థి వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేసింది. అయితే వీసా జారీకి అవ‌స‌ర‌మైన సోషల్ మీడియా ఖాతాల ప‌రిశీల‌న‌కు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని, అందుకే వీసాల జారీని నిలిపివేశామ‌ని అప్ప‌ట్లో విదేశాంగ శాఖ (Department of Foreign Affairs) తెలిపింది. ఈ క్ర‌మంలోనే తాజాగా సోష‌ల్ మీడియా వెట్టింగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ వీసా అపాయింట్‌మెంట్ల ప్ర‌క్రియ‌ను పున‌రుద్ధ‌రించింది. “పబ్లిక్”గా సెట్ చేయడానికి, వాటిని సమీక్షించడానికి అనుమతించడానికి నిరాకరించే దరఖాస్తుల‌ను తిరస్కరించనున్న‌ట్లు పేర్కొంది. అలా చేయడానికి నిరాకరించడం వారు అవసరాన్ని తప్పించుకోవడానికి లేదా వారి ఆన్‌లైన్ కార్యాచరణను దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.