Runamafi | చేనేత కార్మికులకు గుడ్​న్యూస్​.. రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Runamafi | రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు (handloom workers) గుడ్​ న్యూస్​ చెప్పింది. నేతన్నల రుణాలను మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఇందులో భాగంగా తాజాగా రూ.33 కోట్లు రుణమాఫీ (Runamafi) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్​ సెక్రెటరీ శైలజా రామయ్యర్ (Shailaja Ramayyar) శనివారం ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలు & వాణిజ్య శాఖ చేనేత నేత […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Runamafi | రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు (handloom workers) గుడ్​ న్యూస్​ చెప్పింది. నేతన్నల రుణాలను మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఇందులో భాగంగా తాజాగా రూ.33 కోట్లు రుణమాఫీ (Runamafi) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్​ సెక్రెటరీ శైలజా రామయ్యర్ (Shailaja Ramayyar) శనివారం ఆదేశాలు జారీ చేశారు.

పరిశ్రమలు & వాణిజ్య శాఖ చేనేత నేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ డబ్బులను అర్హులైన నేతన్నల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న చేనేత రుణాలు మాఫీ కానున్నాయి. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని గతంలో సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. దీంతో నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రుణమాఫీపై మార్గదర్శకాలు వెలువడితే ఎవరు అర్హులనే దానిపై స్పష్టత రానుంది.

Related articles

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్...

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల...