అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pending Bills | ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లులకు సంబంధించి తాజాగా నిధులు విడుదల చేసింది.ఉద్యోగులకు జనవరి నెలకు సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం రూ.720 కోట్లను విడుదల చేసింది.
2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్‌ను క్లియర్ చేసింది. ఉద్యోగులు వాడుకొని సెలవులకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. గ్రాట్యుటీ, GPF (General Provident Fund), సరెండర్ లీవ్ అడ్వాన్సుల కోసం ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
Pending Bills | కొన్ని నెలలుగా..
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) భారీగా బకాయి పడింది. అనేక బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో విడతల వారీగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) హామీ ఇచ్చారు. ఈ మేరకు జూన్ నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. జూన్‌లో రూ.183 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లపైనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. నవంబర్‌లో రూ.707 కోట్లు, డిసెంబర్లో రూ.713 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా రూ.720 కోట్లు విడుదల చేసింది.
Pending Bills | ఉద్యోగుల హర్షం
ప్రభుత్వం ప్రతి నెలా పెండింగ్ బిల్లుల కోసం నిధులు విడుదల చేస్తుండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల అవుతున్నాయని చెబుతున్నారు. మిగతా నిధులను సైతం త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.