Nethanna Bharosa | నేతన్నలకు గుడ్​న్యూస్​.. ఒక్కొక్కరికి రూ.18 వేల సాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nethanna Bharosa |తెలంగాణ(Telangana)లోని నేత కార్మికుల(Handloom Workers)కు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాంగ్రెస్​ తాము అధికారంలోకి వస్తే నేతన్నలకు సాయం చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా నేతన్నకు భరోసా (Nethanna Bharosa scheme) పథకం ప్రవేశ పెట్టింది. తాజాగా పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న నేతన్నలు, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nethanna Bharosa |తెలంగాణ(Telangana)లోని నేత కార్మికుల(Handloom Workers)కు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాంగ్రెస్​ తాము అధికారంలోకి వస్తే నేతన్నలకు సాయం చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా నేతన్నకు భరోసా (Nethanna Bharosa scheme) పథకం ప్రవేశ పెట్టింది. తాజాగా పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న నేతన్నలు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేతన్నలకు ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు అందించనుంది. ఈ డబ్బులను రెండు విడతల్లో అందించనున్నట్లు పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయంతో 40 వేల మంది చేనేత, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. నేతన్నకు భరోసా కోసం బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయంతో నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సిరిసిల్లలో ఎక్కువ మంది నేత కార్మికులు జీవిస్తున్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోను చేనేత కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ ఆర్థిక భరోసా లభించనుంది.

Related articles

Feb 24 Gold Prices | మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధ‌ర‌లు

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 24 Gold Prices | దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు ప‌రుగులు పెడుతున్నాయి.. కాస్త తగ్గుతుందని సంతోషపడ్డ వినియోగదారుల్లో...

Feb 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

Feb 24 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ...

government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు.. ఇకపై క్యాష్​లెస్​ వైద్యసేవలు

అక్షరటుడే, హైదరాబాద్​: government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు...

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...