ePaper
More
    Homeఅంతర్జాతీయంGold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​..భారీగా పడిపోయిన ధర..ఈ రోజు ఎంతంటే..

    Gold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​..భారీగా పడిపోయిన ధర..ఈ రోజు ఎంతంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్:Gold Price | అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వరుసగా పెరుగుతూ పోయి లకానం దాటిన పసిడి ధర gold rates ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. తులం బంగారం ధర(Gold Price) ఒక్కరోజే ఏకంగా రూ.3000 తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) చేసిన ప్రకటనతో బంగారం ధరల పరుగులకు బ్రేక్ పడింది.

    చైనాపై టారిఫ్‌(Tarrif)లు తగ్గిస్తామన్న సంకేతాలతో బంగారం పెట్టుబడులపై మదుపరులు లాభాల స్వీకరణ వైపు మళ్లారు. దీంతో బంగారం ధలు దిగొచ్చాయి. నిన్నటి వరకు ఔన్స్ పసిడి ధర 3500 డాలర్ల పైన ఉండగా.. ఈరోజు ఆసియా బులియన్ మార్కెట్లో(Asian bullion market) ఏకంగా 3 శాతం మేర పడిపోయింది. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి.

    హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 98,350 గా ఉంది. అంతకు ముందు రోజు రూ. లక్ష మార్క్ చేరిన సంగతి తెలిసిందే. 22 క్యారెట్ల ఆభరణాల ధర తులంపై రూ.2,750 తగ్గి, రూ. 90,150 పలుకుతోంది.

    ఇక వెండి(Silver) విషయానికి వస్తే.. కిలోకి రూ. వంద తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...