అక్షరటుడే, వెబ్డెస్క్: Gold Prices Fallen | కొద్ది రోజులుగా రాకెట్ వేగంగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) భారీగా తగ్గాయి. ఎన్నడు లేని విధంగా ఒక్క రోజులో రూ.8 వేలపైగా తగ్గడంతో పసిడిప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బంగారం ధరలు (Today Gold Rates) ఒక్కసారిగా భారీగా దిగి వచ్చాయి. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.78 లక్షలుగా నమోదైంది. ఉదయం 10 గంటల వరకు రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. తులం మేలిమి బంగారం ధర రూ.8,230 తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ.1,70,620 పలుకుతోంది. మరోవైపు 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములపై రూ. 7,550 తగ్గి రూ.1,56,400కి చేరింది. కిలో వెండి ఏకంగా 15 వేలు తగ్గడంతో రూ.3,95,000కు చేరింది.
Gold Prices Fallen | ఒక్కసారిగా..
గత కొంతకాలంలో బంగారం, వెండి రేట్లు (Silver Prices) భారీగా పెరుగుతున్నాయి. నిత్యం వేలల్లో ధరలు పెరుగుతూ వచ్చాయి. అప్పుడప్పుడు రేట్లు తగ్గిన స్వల్పంగా మాత్రమే తగ్గుదల కనిపించింది. అయితే శుక్రవారం భారీగా రేట్లు పడిపోవడం గమనార్హం. బంగారం ధర రూ.8 వేలకు పైగా ఒక్కరోజులో దిగి వచ్చింది. దీంతో పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేట్లు ఇంకా తగ్గుతాయా.. మళ్లీ పెరుగుతాయా అని తెలియక చాలా మంది అయోమయానికి గురి అవుతున్నారు. త్వరలో పెళ్లిల సీజన్ ప్రారంభం కానుంది. వివాహాలు నిశ్చయం అయిన కుటుంబాలు పసిడిని కొనాలా.. ఆగాలా అని ఆలోచిస్తున్నాయి.