HomeజాతీయంGold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Price | బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఒకే రోజు తులం బంగారం ధర ఏకంగా రూ.9 వేలు తగ్గింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర కారణాలతో కొంతకాలంగా బంగారం ధరలు (Gold Rates) వేగంగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం ధరలు పెరుగుతుండటం, తులం బంగారం రూ.రెండు లక్షలకు చేరుతుందనే వార్తలతో ప్రజలు ఇక బంగారం కొనలేమని భయపడ్డారు. అయితే తాజాగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Gold Price | రూ.9 వేలు తగ్గిన గోల్డ్​

హైదరాబాద్​ (Hyderabad) మార్కెట్​లో బుధవారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారంతో పోలీస్తే ఏకంగా రూ.9 వేలు తగ్గడం గమనార్హం. ఈ మధ్య కాలంలో ఇంతమొత్తంలో బంగారం ధరలు ఎప్పుడు తగ్గలేదు. దీంతో ప్రజలు ఆనంద పడుతున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,25,250 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ.1,14,843కి పడిపోయింది. ధరలు మరింత దిగి వస్తే కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వివాహాల సీజన్​ కావడంతో పసిడి ధర తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Gold Price | వెండి ధరలు సైతం..

ఇటీవల బంగారంతో పాటు వెండి ధరలు (Silver Rates) సైతం భారీగా పెరిగాయి. పసిడి రేట్లు పెరగడంతో ఇన్వెస్టర్లు, ప్రజలు ముందు జాగ్రత్తగా వెండిని కొనుగోలు చేశారు. దీంతో డిమాండ్​ పెరిగి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే తాజాగా సిల్వర్​ రేట్లు కూడా దిగి వచ్చాయి. కిలో వెండి ధర బుధవారం రూ.7 వేలు తగ్గింది. ప్రస్తుతం రూ.1.58 లక్షల వద్ద ట్రేడ్​ అవుతోంది. వారం రోజుల వ్యవధిలో సిల్వర్​ రేటు ఏకంగా రూ.28వేలు తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 4,022 డాలర్లకు, వెండి 47.84 డాలర్లకు పడిపోయాయి. దీంతో భారత మార్కెట్​లో సైతం రేట్లు తగ్గాయి.