HomeతెలంగాణFarmers | రైతులకు గుడ్​న్యూస్​.. ధాన్యం కొనుగోళ్లు ఎప్పటి నుంచంటే?

Farmers | రైతులకు గుడ్​న్యూస్​.. ధాన్యం కొనుగోళ్లు ఎప్పటి నుంచంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers | వానాకాలం (Kharif) సీజన్​లో సాగు అవుతున్న ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమాయత్తం అవుతోంది.

రాష్ట్రంలో వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్​ ఇస్తామని చెప్పడంతో ఇందులో 60శాతం సన్నరకాలనే సాగు చేశారు. ఈ సీజన్​లో మొత్తం కోటిన్నర మెట్రిక్​ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో కోటి టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Farmers | అక్టోబర్​ 1 నుంచి..

రాష్ట్రంలో ప్రస్తుతం వరి పంట ఈనిక దశలో ఉంది. అయితే ముందస్తుగా సాగు చేసిన జిల్లాలో వరి పొలాలు 15 రోజుల్లో కోతకు రానున్నాయి. దీంతో ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియపై ఫోకస్​ పెట్టింది. భారత ఆహార సంస్థ (FCI) మార్గదర్శకాల​ ప్రకారం.. అక్టోబర్​ 1 నుంచి ధాన్యం సేకరణ (Paddy Buying) ప్రారంభించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్​ 1 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించాలని యోచిస్తోంది. వీలైతే కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగు రోజులు ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

Farmers | 8 వేల కొనుగోలు కేంద్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​, నల్గొండ (Nalgonda) జిల్లాల్లో ముందస్తుగా వరిసాగు చేస్తారు. ముఖ్యంగా బాన్సువాడ, బోధన్​ నియోజకవర్గాల్లో ముందుగా సాగు చేస్తారు. దీంతో బాన్సువాడ, బోధన్​, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ధాన్యం సేకరణపై చర్చించేందుకు ఎఫ్​సీఐ అధికారులు మంగళవారం హైదరాబాద్​ వస్తున్నారు.

Farmers | బోనస్​ ఇస్తారా..

కేంద్ర ప్రభుత్వం వానాకాలం సీజన్​కు ధాన్యం మద్దతు ధరను ప్రకటించింది. ఏ గ్రేడ్​కు రూ.2,389, బీ గ్రేడ్​ ధాన్యానికి రూ.2,369 చెల్లించనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించడానికి క్వింటాల్​కు రూ.500 బోనస్ (Paddy Bonus)​ ఇస్తామని ప్రకటించింది. గత వానాకాలం సీజన్​కు సంబంధించి రైతుల ఖాతాల్లో బోనస్​ డబ్బులు జమ అయ్యాయి. యాసంగిలో సీజన్​లో విక్రయించిన వారికి ఇప్పటి వరకు బోనస్​ ఇవ్వలేదు. మరి వానాకాలం సీజన్​లో సైతం బోనస్​ ఇస్తారా లేదా చూడాల్సి ఉంది.

Must Read
Related News