ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచి రైతు భరోసా

    Rythu Bharosa | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచి రైతు భరోసా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా.. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రైతు భరోసా నిధులు (Rythu Bharosa Funds) ఇవ్వాలని నిర్ణయించారు. రేపటి నుంచి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.

    Rythu Bharosa | జోరుగా సాగు వ్యవసాయ పనులు

    ఖరీఫ్​ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో వ్యవసాయ పనులు (agricultural works) జోరుగా సాగుతున్నాయి. సాగు పనుల్లో అన్నదాతలు బిజీగా మారారు. వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు (Farmers) నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులు శుభవార్త చెప్పింది.

    Rythu Bharosa | ముందు వారికే..

    రైతు భరోసాకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం (Governament) ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్​బీఐ నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం.. మరో రూ.మూడు వేల కోసం ఇండెంట్​ పెట్టింది. ఈ క్రమంలో రైతు భరోసా జమ చేయడానికి ఆర్థిక శాఖ (Finance Department) సిద్ధమైంది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

    Rythu Bharosa | కొత్త రైతులకు అవకాశం

    కొత్తగా జూన్ ​5లోపు పట్టాపాస్​బుక్​ పొందిన రైతలకు కూడా రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రైతు భరోసా రాకుండా కొత్త పాస్​బుక్​ పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచింది. దీంతో వ్యవసాయాధికారులు వారి నుంచి దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారు. అలాగే బ్యాంక్​ అకౌంట్​ (Bank Account) మార్చుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రైతు భరోసా (Rythu Bharosa) జమ అయిన వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    More like this

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...