అక్షరటుడే, వెబ్‌డెస్క్:Rythu Bharosa | తెలంగాణ ప్రభుత్వం (State Government) రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను నాట్లు పడకముందే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ప్రకటించారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా జమ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చాక తొలి సీజన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున జమ చేసింది. అనంతరం గత వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా(Raithu Bharosa)ను ప్రభుత్వం జమ చేయలేదు. యాసంగి సీజన్‌కు మాత్రం రైతు భరోసాను రూ.6 వేలకు పెంచింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. అదికూడా నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది.
Rythu Bharosa | మంత్రి ప్రకటనతో హర్షం
రైతు భరోసా సకాలంలో జమ కాకపోవడంతో గత సీజన్లో చాలా మంది రైతులు (Farmers) పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఈ సారి నాట్లు పడకముందే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే భరోసా నిధుల కోసం ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం.