HomeUncategorizedAgriculture | రైతులకు గుడ్‌న్యూస్.. వరికి మద్దతు ధర రూ.69 చొప్పున పెంపు

Agriculture | రైతులకు గుడ్‌న్యూస్.. వరికి మద్దతు ధర రూ.69 చొప్పున పెంపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Agriculture | వర్షాకాల పనుల్లో నిమగ్నమవుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం(Central government) గుడ్‌న్యూస్ చెప్పింది. పల పంటలకు మద్దతు ధర పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్కు(Kharif season) వరి మద్దతు ధరను 69 రూపాయలకు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర 2,369 రూపాయలకు చేరింది. కేంద్రం MSP కోసం 2.70 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాదు.. రైతులకు(Farmers) వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించింది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది.

Agriculture | రైతులకు లాభం చేకూర్చేలా..

వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపే అనేక ముఖ్యమైన చర్యలకు కేంద్ర మంత్రివర్గం(Ministerial cabinet) మంగళవారం ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల (MSP) తాజా పెంపు, రైతులకు వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అంతటా కీలకమైన రోడ్డు మరియు రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ తెలిపింది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (CACP) సిఫార్సుల ఆధారంగా 2025–26 సీజన్కు ఖరీఫ్ పంటలకు MSPని క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Ashwini Vaishnav) తెలిపారు. ఇందుకోసం రూ. 2.07 లక్షల కోట్ల మేర నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ‘‘గత 10–11 సంవత్సరాలలో ఖరీఫ్ పంట MSPలలో పెద్ద పెరుగుదల జరిగింది. రైతులు తమ ఉత్పత్తి ఖర్చు కంటే కనీసం 50% లాభం పొందేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) చూసుకున్నారు. తదనుగుణంగా అన్ని పంటల ద్వారా రైతులకు లాభం వస్తుందని మేము నిర్ధారించామని” వైష్ణవ్ అన్నారు.

Agriculture | వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు..

రైతులకు రాయితీ వడ్డీ రేటుతో స్వల్పకాలిక రుణాన్ని అందించే వడ్డీ రాయితీ పథకం(subsidy scheme) కొనసాగింపుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులు 4% వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు రుణాలు పొందే పథకాన్ని కేంద్రం ఆమోదించింది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మొదట ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) చొరవ రైతులకు వర్కింగ్ క్యాపిటల్ను సులభతరం చేసిందని వైష్ణవ్ అన్నారు. “ఈ పథకం ద్వారా, మేము వడ్డీని ఖర్చును తగ్గించాము. చిన్న మరియు సన్నకారు రైతులకు రుణాలు సులభంగా పొందేలా చేసాము”అని ఆయన అన్నారు.

Agriculture | ఏపీలో కొత్త 4-లేన్ల రహదారి

రహదారి మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహకంగా, జాతీయ రహదారి-67లోని బద్వేల్-గోపవరం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్హెచ్-16ను గురువిందపూడి వరకు అనుసంధానించే 4-లేన్ల రహదారి అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో నిర్మిస్తారు. “ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కృష్ణపట్నం పోర్టు ఉంది. దాని చివరి విభాగం NH-67 ఒక అడ్డంకిగా ఉంది. రూ. 3,653 కోట్ల వ్యయంతో దాదాపు 105 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారిగా (బద్వేల్ నెల్లూరు 4-లేన్ల రహదారి) మార్చేందుకు ఆమోదం తెలిపినట్లు ” కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వార్దా-బల్లార్షా నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. వీటితో పాటు రత్లాం-వార్దా మధ్య రైల్వే లైన్కు ఆమోదం తెలిపింది.