అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TOMCOM | ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు టామ్‌కామ్ (TOMCOM) గుడ్ న్యూస్ చెప్పింది. జపాన్ (Japan)లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో నమోదైన నియామక సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) వివిధ దేశాల్లో తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జపాన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి చర్చలు చేపట్టింది.
ఆటోమోటివ్, మెకానికల్, ఐటీ/సీఎస్ ఇంజినీర్ (Engineer) పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. సంబంధిత కోర్సులు చదివిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకునే వారికి కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 22 నుంచి 40 లోపు ఉండాలి. ఆంగ్ల భాషపై పట్టు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లను tomcom.resume@gmail.com కు పంపాలని టామ్‌కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాల కోసం 9440048590, 9440052592, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించింది.