అక్షరటుడే, వెబ్డెస్క్ :DA Hike | రాష్ట్ర ప్రభుత్వం(State Government) విద్యుత్ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థ(Electricity company)లో పని చేస్తున్న ఉద్యోగులకు డీఏ ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగులకు 2 శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు చేస్తామన్నారు. దీంతో రాష్ట్రంలోని 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ ఉద్యోగులకు ప్రమాద బీమా(Accident insurance) అమలు చేసింది. విద్యుత్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. తాజాగా డీఏ పెంచడంతో విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
DA Hike | ఉద్యోగులకు వరాలు
రాష్ట్రంలో కొంతకాలంగా ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏ(DA)లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. అనంతరం పెండింగ్ డీఏల్లో ఒకదానిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉద్యోగులకు 3.64శాతం డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన డీఏ 2023 జనవరి 1 నుంచి అమలు చేస్తామని తెలిపింది. తాజాగా విద్యుత్ ఉద్యోగులకు కూడా రెండు శాతం డీఏ పెంచింది.