అక్షరటుడే, వెబ్‌డెస్క్: Electricity Employees | విద్యుత్ శాఖ ఉద్యోగులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (state government) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ (insurance) ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఎస్బీఐ(SBI)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సమక్షంలో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ పథకం కింద.. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి బీమా అందించబడుతుంది.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉద్యోగులకు (electricity department employees) కోటి రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకం అమలు దేశంలో ఇదే తొలిసారన్నారు. ఇందిరమ్మ రాజ్యం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఇలాంటి గొప్ప నిర్ణయాలు సాధ్యమవుతాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి బీమాను తీసుకురాలేదని చెప్పారు. ఇది ఉద్యోగుల్లో ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుందన్నారు.
Electricity Employees | కొత్త ఎనర్జీ పాలసీ
తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కొత్త ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో 2029-30 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తోందని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా ట్రాన్స్ మిషన్‌ను అప్ డేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాలు కూడా ధైర్యంగా, నమ్మకంగా ఉండేందుకు.. బీమా ఇస్తున్నట్లు చెప్పారు.