అక్షరటుడే, వెబ్‌డెస్క్:Charging Stations | దేశంలో విద్యుత్ వాహనాల electric vehicles in india వినియోగం గణనీయంగా పెరిగింది. గత రెండుమూడేళ్లగా ఈవీ టూవీలర్స్‌తో పాటు కార్లు సైతం ప్రజలు భారీ సంఖ్యలో కొనుగులు చేస్తున్నారు. అయితే ఛార్జింగ్(Charging) అనేది కొంత వరకు సమస్యగా మారింది. ఇక నుంచి ఈ సమస్యకు చెక్ పడనుంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ఇక నుంచి రయ్రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ‘పీఎం ఈ-డ్రైవ్’ స్కీం(PM E-Drive’ Scheme) కింద దేశవ్యాప్తంగా సుమారు 72వేల ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.2వేల కోట్లు కేటాయించనుంది. ఈ నిధులతో కొత్తగా 50 నేషనల్ హైవే కారిడార్లు, మెట్రో నగరాలు, విమానాశ్రయాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల్లోని రహదారులపై ఛార్జింగ్ స్టేషన్లను (Charging Stations) ఏర్పాటు చేయనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
Charging Stations | పీఎం ఈ-డ్రైవ్ పథకం అంటే..
ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ‘పీఎం ఈ-డ్రైవ్’ను ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం భారత్ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ పథకంపై జరిగిన సమన్వయ సమావేశంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి (Minister Kumaraswamy) మాట్లాడారు.
“సుస్థిర రవాణా నిర్వహణలో భారతదేశం గ్లోబల్ మోడల్‌గా మారే దిశగా పయనిస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం అనేది పౌరులకు సరసమైన, సౌకర్యవంతమైన రవాణాను అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. మౌలిక సదుపాయాలను అందించడమే కాకుండా ఇంధన భద్రత, హరిత ఆర్థిక వృద్ధికి పునాది వేస్తున్నాం” అని కుమారస్వామి పేర్కొన్నారు.