అక్షరటుడే, హైదరాబాద్: TG EAPCET Counseling | తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్- ఎప్‌సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో 73.26 శాతం, అగ్రికల్చర్ – ఫార్మా విభాగాల్లో 87.82 శాతం విద్యార్థులు పాసయ్యారు.
రెండు విభాగాల్లోనూ అబ్బాయిలే టాప్ ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌లో తొలి 10, అగ్రికల్చర్ విభాగంలో మొదటి 9 ర్యాంకులను అబ్బాయిలే అందుకున్నారు.
TG EAPCET Counseling | జులై మొదటి వారంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్
జూన్ నెలాఖరు కానీ, జులై మొదటి వారంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. జూన్ 2న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు(JEE Advanced results) వెల్లడవుతాయి.
ఆ వెంటనే ఐఐటీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)IITs (Indian Institutes of Technology) లతో పాటు ఎన్‌ఐటీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)NITs (National Institutes of Technology)లు, ట్రిపుల్ ఐటీ(ఇంటర్నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)Triple IT (International Institutes of Information Technology)ల్లో సీట్ల భర్తీకి జోసా (Joint Seat Allocation Authority – JoSAA) కౌన్సెలింగ్ మొదలవుతుంది.
కనీసం 4 విడతల జోసా కౌన్సెలింగ్(JoSAA Counseling) తర్వాత ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరులో కానీ, జులై మొదటి వారంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్ చేపట్టి, పూర్తయ్యాక.. ఆగస్టు మొదటి వారంలో ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభిస్తారు.