అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Year Celebrations | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రజలు పార్టీల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో మద్యం వినియోగం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో డ్రంకన్ డ్రైవ్ అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టున్నారు. ఇళ్లకు వెళ్లడానికి క్యాబ్‌లు, ఇతర వాహనాలను ఆశ్రయించాలని, తాగి నడొపద్దని సూచిస్తున్నారు. అయితే మందుబాబులకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPGWU) బంపర్ ఆఫర్ ఇచ్చింది. మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని నిరోధించడానికి ఉచిత రైడ్ సేవలను (free ride services) ప్రకటించింది.
New Year Celebrations | ఫ్రీగా ఇళ్లకు..
ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని, నూతన సంవత్సర వేడుకల సమయంలో మద్యం సేవించి సురక్షితంగా ఇంటికి తిరిగి రాలేని వ్యక్తుల కోసం TGPGWU ఉచిత రవాణా సేవలను ప్రకటించింది. డిసెంబర్ 31న రాత్రి 11 గంటల నుంచి జనవరి 1న తెల్లవారుజామున ఒంటి గంట వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిమితుల్లో ఉచిత రైడ్లు అందుబాటులో ఉంటాయి. TGPGWU అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వాహనదారులకు, పాదచారులకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందన్నారు. దీంతోనే తాము #HumAapkeSaathHai ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు.
New Year Celebrations | 8 ఏళ్లుగా..
ఎనిమిది సంవత్సరాలుగా ఉచిత రైడ్ సేవలు అందిస్తున్నట్లు సలాహుద్దీన్ పేర్కొన్నారు. ప్రతి న్యూ ఇయర్‌కు ఆటోరిక్షాలు, క్యాబ్‌ల ద్వారా ఉచిత రైడ్ సేవలను అందిస్తోంది. ఈ ఏడాది బిజ్లిరైడ్ భాగస్వామ్యం ద్వారా ఉచిత రైడ్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సైతం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఉచిత సేవల కోసం క్యాబ్‌లు, ఆటోరిక్షాలు మరియు EV బైక్‌లతో సహా 500 వాహనాలు మోహరించనున్నారు. మత్తు కారణంగా సొంతంగా ప్రయాణించలేని వ్యక్తులు 8977009804కు కాల్ చేయడం ద్వారా ఉచిత సేవను పొందవచ్చు అని ఆయన తెలిపారు.