అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arunachalam | అరుణాచల క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ గిరిప్రదక్షిణ(Giri Pradakshina) చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
తెలంగాణ(Telangana) నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు అరుణాచలం వెళ్తారు. ముఖ్యంగా పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కోసం వేలాదిగా భక్తులు వెళ్తుంటారు. వీరికోసం ఇప్పటికే ఆర్టీసీ పలు స్పెషల్ టూర్ ప్యాకేజీలు తీసుకొచ్చింది. అన్ని డిపోల నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్సులు నడుపుతోంది. తాజాగా తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism Department) సైతం అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రవేశపెట్టింది.
Arunachalam | నాలుగు రోజులు
హైదరాబాద్–అరుణాచలం పేరుతో టూరిజం డిపార్ట్మెంట్ప్యాకేజీ(Tourism Department Package) అందుబాటులోకి తీసుకువచ్చింది. సెప్టెంబర్‌కు సంబంధించిన టూర్ తేదీలను ప్రకటించింది. ఈ టూర్ మొత్తం నాలుగు రోజులు సాగుతోంది. రోడ్డు మార్గం ద్వారా ఈ యాత్ర సాగనుంది. ఇందులో భాగంగా కాణిపాకం, వేలూర్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్(Sripuram Golden Temple) దర్శనం కూడా చేయిస్తారు.
Arunachalam | బుకింగ్స్ ప్రారంభం
సెప్టెంబర్ నెలలో ఈ టూర్ ప్యాకేజీ నాలుగు సార్లు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో హైదరాబాద్ నుంచి అరుణాచలం(Hyderabad to Arunachalam) యాత్ర ఉంటుంది. ఆయా తేదీల్లో వెళ్లాలనుకునే వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. తెలంగాణ టూరిజం వెబ్సైట్ https://tourism.telangana.gov.in/tours లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్లో భాగంగా పెద్దలకు రూ.8 వేలు, పిల్లలు రూ.6,400గా టికెట్ ధర నిర్ణయించారు.
1 comment
[…] ప్రకాశిస్తాడు. ఈ సమయంలో అరుణాచలం (Arunachalam) నుండి వెలువడే శివుని దివ్య శక్తి […]
Comments are closed.