అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sabarimala Special Trains | శబరిమల భక్తులకు (Sabarimala Devotees) దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 60కిపైగా స్పెషల్ ట్రెయిన్లు నడపనున్నట్లు ప్రకటించింది.
శబరిమల వెళ్లే భక్తులకు కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అయితే నేటి నుంచే రిజర్వేషన్‌కు అవకాశం కల్పించింది. ఈ స్పెషల్ ట్రెయిన్లు చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి ఏర్పాటు చేశారు. రైళ్ల షెడ్యూల్‌తో పాటు హాల్ట్ స్టేషన్లు.. పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు.
Sabarimala Special Trains | రెగ్యులర్ రైళ్లలో బుకింగ్స్ ఫుల్
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ఇక్కడి నుంచి రోజూ పలు రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే వీటిలో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. దీంతో అదనపు ట్రెయిన్స్ కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ (Railway Department) తొలి విడతగా 60 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
Sabarimala Special Trains | రైళ్ల వివరాలివే..
చర్లపల్లి నుంచి కొల్లాంకు రైళ్లు నడపనున్నారు. ఇది నవంబర్ 17, 24 తేదీల్లో, డిసెంబర్ 1, 8, 15, 22, 29, అలాగే జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరి వెళ్తాయి. ఇవి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటాయి.
కొల్లాం నుంచి చర్లపల్లికి ట్రెయిన్లను నడపనున్నారు. ఇవి నవంబర్ 19, 26 తేదీల్లో, డిసెంబర్ 3, 10, 17, 24, 31, అలాగే జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లాం నుంచి బయల్దేరుతాయి. తరువాతి రోజున చర్లపల్లికి చేరుకుంటాయి. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, గుంటూరు, పగిడిపల్లి మీదుగా వస్తాయి. అదే విధంగా మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి మరో 50 రైళ్లను అధికారులు ప్రకటించారు.