అక్షరటుడే, వెబ్డెస్క్ : Contract employees | ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీరాజ్ (Panchayat Raj), గ్రామీణాభివృద్ధి శాఖ (Rural Development Department)లో పని చేస్తున్న 12,055 మంది సేవలను 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి సేవలు 2025 మార్చి 31తోనే ముగిశాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయినా కానీ కాంట్రాక్ట్ (contract), ఔట్ సోర్సింగ్ (outsourcing) సిబ్బంది విధులకు హాజరవుతున్నారు.
ప్రభుత్వం వారి సేవలను పొడిగించకపోవడంతో ఏప్రిల్ నుంచి జీతాలు అందడం లేదు. తాజాగా 2026 మార్చి 31 వరకు సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో త్వరలోనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. వారి సేవలను పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.