ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover) శనివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్​ అయిన గచ్చిబౌలి–కొండాపూర్​ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ట్రాఫిక్​ జామ్​తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు.

    ఈ క్రమంలో ట్రాఫిక్​ నియంత్రణ కోసం ప్రభుత్వం గతంలోనే ఇక్కడ రెండు ఫ్లై ఓవర్లు నిర్మించింది. ప్రస్తుతం అవి అందుబాటులో ఉండగా.. తాజాగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ వరకు మరో ఫ్లై ఓవర్​ నిర్మాణం పూర్తయింది. దీనికి మాజీ మంత్రి, కార్మిక నాయకుడు పీ జనార్దన్​రెడ్డి (PJR) పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్​ను శనివారం సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నారు.

    PJR Flyover | రూ.182 కోట్లతో నిర్మాణం

    నగర వాసుల ముఖ్యంగా ఐటీ కారిడార్‌ (IT Corridor)లో ప్రయాణించే వారి సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ఫ్లై ఓవర్​ నిర్మించింది. SRDP కింద రూ.182.72 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్​తో ప్రజలకు ట్రాఫిక్​ తిప్పలు తప్పనున్నాయి. 1.2 కి.మీ పొడవు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్‌లతో దీనిని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే ఔటర్​ రింగ్​రోడ్డు నుంచి కొండాపూర్​, హాఫీజ్​పేట్​ మార్గాల్లో వెళ్లేవారికి సమయం ఆదా కానుంది. కొండాపూర్​ నుంచి ఓఆర్ఆర్​ మీదుగా శంషాబాద్​ విమానాశ్రయానికి (Shamshabad Airport) వేగంగా చేరుకోవచ్చు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...