అక్షరటుడే, వెబ్డెస్క్ : DA Hike | దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం(Central Government) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) అధ్యక్షతన కేబినేట్ సమావేశం(Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ (DR) ప్రభుత్వం పెంచింది. 3 శాతం డీఏ పెంపునకు తాజాగా కేబినెట్ ఓకే చెప్పింది. పెరిగిన జీవో 2025 జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో దాదాపు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం రెండు శాతం డీఏ పెంచింది. ఇది 2025 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుత పెంపుతో డీఏ 58 శాతానికి చేరింది.
DA Hike | కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం
దేశవ్యాప్తంగా 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.11,440 కోట్లు కేటాయించింది. దీంతో రైతులకు ఎంతో మేలు జరగనుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయాల్లో బాల వాటిక (ప్రీ ప్రైమరీ తరగతులు)లు ఉంటాయి. వీటితో 4,617 మందికి ఉపాధి లభిస్తుంది. తొమ్మిదేళ్లలో రూ.5,862 కోట్లతో వీటిని నిర్మించనున్నారు.