అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet meeting | రాష్ట్ర ప్రభుత్వం మద్యంప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. నగరాల్లో ఐదు కిలోమీటర్లకు ఒక బీర్ కేఫ్ (Beer Cafe) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో నిర్ణయం తీసుకున్నారు.
Cabinet meeting | మినీ బ్రూవరీలు..
మందుబాబుల కోసం నగరాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు, పట్టణాల్లో 30 కి.మీ.లకు ఒకటి చొప్పున మినీ బ్రూవరీలను ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఓకే చెప్పింది. దీని కోసం మైక్రో బ్రూవరీస్ చట్టంలో పలు మార్పులు చేయనున్నారు. త్వరలోనే వీటిని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే పట్టణాలు, నగరాల్లో మద్యం విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. మైక్రో బ్రూవరీల ఏర్పాటుతో నగరాలు, పట్టణాల్లో ఇన్ స్టంట్ బీర్ కేఫ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Cabinet meeting | మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు
బీఆర్ఎస్ (BRS) హయాంలో 2023లో మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేశారు. ఎన్నికల సమయంలో కావడంతో నాటి ప్రభుత్వం గడువు కంటే ముందుగానే టెండర్లు నిర్వహించింది. 2023 ఆగస్టులో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలో డిసెంబర్ 1తో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో కొత్త దుకాణాల కోసం త్వరలోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.