HomeజాతీయంBihar Election Results | సుపరిపాలన, అభివృద్ధి గెలిచాయి : ప్రధాని మోదీ

Bihar Election Results | సుపరిపాలన, అభివృద్ధి గెలిచాయి : ప్రధాని మోదీ

బీహార్​లో సుపరిపాలన, అభివృద్ధి గెలిచాయని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించడంపై ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : Bihar Election Results | బీహార్​లో ఎన్డీయే (NDA) ఘన విజయం సాధించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. బీహార్​లో సుపరిపాలన, అభివృద్ధి గెలిచాయన్నారు.

బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. 243 స్థానాల్లో 200కు పైగా సీట్లను ఎన్డీఏ కైవసం చేసుకుంది. దీనిపై ప్రధాని స్పందించారు. బీహార్​ ప్రజలు అద్భుతమైన తీర్పు చెప్పారన్నారు. రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే వారి ట్రాక్ రికార్డ్, దార్శనికతను చూసిన తర్వాత ప్రజలు అధికార కూటమికి భారీ విజయాన్ని అందించారని చెప్పారు. బీహార్​లో ప్రజా సంక్షేమం గెలిచిందన్నారు. ఎన్నికల్లో ఎన్డీయేను చారిత్రాత్మక, అపూర్వమైన విజయంతో ఆశీర్వదించిన బీహార్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పు ప్రజలకు సేవ చేయడానికి, బీహార్ కోసం కొత్త సంకల్పంతో పనిచేయడానికి తమకు శక్తినిస్తుందన్నారు.

Bihar Election Results | వారికి అభినందనలు

అఖండ మెజారిటీ సాధించడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Chief Minister Nitish Kumar), ఎల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, హెచ్ఏఎం వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహాలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో, బీహార్ పురోగతి, మౌలిక సదుపాయాలు, సంస్కృతి కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీయే 200 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. 101 సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఏకంగా 90కి పైగా స్థానాలు సాధించింది.

Bihar Election Results | వికసిత్​ బీహార్​

బీహార్​ విజయంపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) స్పందించారు. వికసిత్ బీహార్‌పై విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయం ఇది అన్నారు. జంగల్‌రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి దోచుకునే అవకాశం లభించదని విమర్శించారు. మోదీ, నితీశ్​కుమార్​ ప్రభుత్వాలపై ప్రజల నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అన్నారు.

Must Read
Related News