Homeఅంతర్జాతీయంGolden Toilet | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్.. బంగారంతో చేసిన కళాఖండం వేలానికి సిద్ధం

Golden Toilet | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్.. బంగారంతో చేసిన కళాఖండం వేలానికి సిద్ధం

ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగారు టాయిలెట్‌ మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఇది వేలానికి సిద్ధంగా ఉంది. దీని కనీస ధర 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు)గా నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Golden Toilet | ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విలాస వస్తువుల జాబితాలో మరో అద్భుతం చేరబోతోంది. పూర్తిగా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయిలెట్‌ ఇప్పుడు వేలానికి రాబోతోంది.

ఇది సాధారణ టాయిలెట్ కాదు, ఇటాలియన్ ప్రముఖ కళాకారుడు మారిజియో కాటెలాన్ (Maurizio Cattelan) రూపొందించిన “అమెరికా” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కళాఖండం. ప్రతిష్టాత్మక వేలం సంస్థ సోత్’బీస్ ఈ నెల‌ 18న న్యూయార్క్‌లో ఈ బంగారు టాయిలెట్‌ను (Golden Toilet) వేలం వేయనుంది. దీని ప్రారంభ ధరను సుమారు 10 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) గా నిర్ణయించారు. మొత్తం బరువు 101.2 కిలోలు ఉన్న ఈ టాయిలెట్ పూర్తిగా పనిచేసే విధంగా తయారు చేయబడింది.

Golden Toilet | వేలంకి సిద్ధం..

కాటెలాన్ ఈ టాయిలెట్‌ను సంపన్నుల విలాసపు ప్రతీకగా రూపొందించారు. ఇంతకుముందు ఆయన గోడకు టేప్‌తో అతికించిన ఒక అరటిపండుని ‘కామెడియన్’ పేరుతో ప్ర‌ద‌ర్శించి దానిని 6.2 మిలియన్ డాలర్లకు విక్రయించి సంచలనాన్ని సృష్టించారు. అలాగే మోకాళ్లపై కూర్చుని ఉన్న హిట్లర్ శిల్పంను 17.2 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2016లో ఈయన రెండు బంగారు టాయిలెట్లను తయారు చేశారు. వాటిలో ఒకటి 2019లో ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో (Blenheim Palace) ప్రదర్శనలో ఉండగా దొంగతనానికి గురైంది. దొంగలు టాయిలెట్‌ను ప్లంబింగ్‌తో సహా తొలగించి ఎత్తుకుని పారిపోయారు. ఇప్పటికీ అది దొరకలేదు. పోలీసుల అంచనా ప్రకారం దానిని కరిగించి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇప్పుడు వేలానికి రాబోతున్నది రెండవ టాయిలెట్. దీనిని 2017 నుంచి ఒక ప్రైవేట్ స్థలంలో భద్రపరిచారు. గతంలో ఈ కళాఖండాన్ని న్యూయార్క్ గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ప్రదర్శించినప్పుడు దానిని ఉపయోగించేందుకు లక్ష మందికి పైగా సందర్శకులు క్యూ కట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్ హౌస్ కోసం ఒక వాన్ గో పెయింటింగ్‌ను కోరగా, మ్యూజియం అధికారులు దానికి బదులుగా ఈ బంగారు టాయిలెట్‌ను ఆఫర్ చేశారు. సోత్ బీస్ ప్రకారం.. ఈ నెల‌ 8 నుంచి వేలం ముగిసే వరకు ఈ “అమెరికా” టాయిలెట్‌ను వారి ప్రధాన కార్యాలయ బాత్రూంలో ప్రదర్శనకు ఉంచుతారు. సందర్శకులు దానిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఈసారి దానిని ఉపయోగించలేరు – కేవలం చూడగలరు, ఫ్లష్ చేయలేరు.

Must Read
Related News