అక్షర టుడే, వెబ్డెస్క్: Nizamabad City | నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్డులోగల గోల్డెన్ జూబ్లీ జూనియర్ కళాశాలకు అనుమతి లేదని అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి నాదిర్ షా రజానీ (Nadir Shah Razani) ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కళాశాల ఇదివరకు ట్రస్ట్ భవనంలో లీజుకు కొనసాగిందని, అయితే ఆ గడువు ముగిసిందన్నారు. ఈ మేరకు భవనాన్ని ఖాళీ చేయాలని కళాశాల యాజమాన్యానికి నోటీసు సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయినా, కళాశాల యాజమాన్యం ఈ విషయం దాచిపెట్టి అడ్మిషన్లు చేసుకుంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అల్ ముర్తుజా ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోశాధికారి రజియా, సిబ్బంది ఉన్నారు.