ePaper
More
    Homeబిజినెస్​Gold Price | షాక్​ ఇచ్చిన గోల్డ్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన ధరలు.. ఈ...

    Gold Price | షాక్​ ఇచ్చిన గోల్డ్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Gold Price | పసిడి ప్రియులకు గోల్డ్ (Gold) రేట్లు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్​లో ఒకేసారి ధరలు పుంజుకున్నాయి.

    ఆల్ టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధరలు దిగొస్తున్నాయనుకునే లోపే మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ (Hyderabad)​లో 22 క్యారెట్ల గోల్డ్ ధర ఒక్కరోజులోనే రూ. 200 పెరిగి, తులానికి రూ. 90,020 పలుకుతోంది. దీనికి ముందు రోజే రూ. 600 పడిపోవడం గమనార్హం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం తులానికి రూ. 220 పెరిగి, రూ. 98,400 గా కొనసాగుతోంది. నిన్న రూ. 660 తగ్గి, ఊరించింది.

    Gold Price | హైదరాబాద్​ కంటే ఢిల్లీలోనే..

    దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 90,350గా, 24 క్యారెట్స్ రూ. 98,550గా విక్రయిస్తున్నారు. అంటే హైదరాబాద్​ కంటే ఢిల్లీలోనే గోల్డ్ రేటు ఎక్కువగా ఉంది.

    Gold Price | అంతర్జాతీయ మార్కెట్​లో..

    అంతర్జాతీయ మార్కెట్​లోనూ బంగారం ధర పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 3,330 డాలర్ల మార్కుపైనే ఉండటం గమనార్హం. నిన్న మాత్రం ఒక దశలో ఇది 3300 డాలర్లకు దిగువనే కొనసాగింది. ఇక, వెండి మాత్రం 37 డాలర్లపైకి చేరింది.

    పలు దేశాలపై సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలవుతాయని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇప్పటికే ప్రకటించారు. దీనిని వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పసిడి ధరలు పుంజుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

    Gold Price | వెండి ధరలు..

    వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్​లో ప్రస్తుతం కిలోకు రూ. 1.19 లక్షలుగా ఉంది. నిన్ననే దీని ధర రూ. 100 పెరిగింది. ఢిల్లీలో కేజీ రూ. 1.10 లక్షలు పలుకుతోంది. హైదరాబాద్ కంటే ఢిల్లీలోనే వెండి ధర కాస్త తక్కువగా ఉంది.

    More like this

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...