Homeజిల్లాలునిజామాబాద్​Gold Thief | గోల్డ్ వ్యాపారులకు టోకరా.. రూ. 30 లక్షల విలువైన పసిడిని ఎత్తుకెళ్లిన...

Gold Thief | గోల్డ్ వ్యాపారులకు టోకరా.. రూ. 30 లక్షల విలువైన పసిడిని ఎత్తుకెళ్లిన బెంగాలీ కార్మికుడు!

Gold Thief | బెంగాలీ కార్మికుడి చేతిలో బంగారు వ్యాపారులు ఘోరంగా మోసపోయారు. పసిడికి మెరుగులద్దే కార్మికుడికి పెద్ద మొత్తంలో బంగారం ఇచ్చి నిలువు దోపిడీకి గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్​ లో వెలుగు చూసింది.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Gold Thief | ఓ బెంగాలీ కార్మికుడి Bengali worker చేతిలో బంగారు వ్యాపారులు ఘోరంగా మోసపోయారు. పసిడికి మెరుగులద్దే ఆ కార్మికుడికి పెద్ద మొత్తంలో బంగారం ఇచ్చి నిలువు దోపిడీకి గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో వెలుగు చూసింది.

విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని గంజ్​ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పసిడికి మెరుగులద్దే బెంగాలీ కార్మికుడు ఇక్కడ కొన్నేళ్లుగా షాప్​ నడుపుతున్నాడు.

అందరినీ నమ్మబలికాడు. కొన్నేళ్లుగా నమ్మకంగా పనిచేస్తుండటంతో బంగారు వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు తాము విక్రయించే బంగారు ఆభరణాలకు అవసరమైన పాలిష్​ ఇతడితోనే చేయించుకునేవారు.

Gold trader | పావు కేజీకి పైగా..

అలా, బంగారు వర్తకులు సుమారు పావు కిలోకు పైగా అతగాడికి బంగారం gold ఇచ్చినట్లు తెలిసింది. అసలే గోల్డ్​ రేటు చుక్కలను తాకుతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున బంగారం చూసేసరికల్లా అతగాడికి కన్నుకుట్టిందేమో.. ఉన్నదంతా పట్టుకుని, పెట్టేబేడా సర్దుకుని పలాయనం చిత్తగించినట్లు ఉన్నాడు.

బెంగాల్​ కార్మికుడు ఎత్తుకెళ్లిన బంగారం విలువ రూ.  30 లక్షల వరకు ఉంటుందని అంచనా. నగరంలోని ఒకటో ఠాణా పరిధిలో ఈ గోల్డ్​ చోరుడి ఉడాయింపు ఘటన జరిగింది. కాగా, దీనిపై బంగారు వ్యాపారులు ఇంకా బయటకి వచ్చి ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.