అక్షరటుడే, వెబ్‌డెస్క్: gold Price on august 28 | భారత్‌పై అమెరికా America కొత్తగా అమలు చేస్తున్న సుంకాల ప్రభావం దేశీయ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, అమెరికా ఆర్థిక చర్యలు మౌలిక లోహాల ధరలు పెరగడంలో భాగం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతూ వినియోగదారులకు భారంగా మారుతున్నాయి.
ఆగస్టు 28న 24 క్యారెట్ బంగారం (24 carat gold) (10 గ్రాములు): 1,02,450గా నమోదు కాగా, 22 క్యారెట్ బంగారం (22 carat gold) (10 గ్రాములు): 93,910గా ట్రేడ్ అయింది.
ఇక 18 క్యారెట్ బంగారం (10 గ్రాములు): 76,840గా ఉంది. వెండి ధర (కిలో): 1,19,900గా ఉంది. ప్లాటినం ధర (10 గ్రాములు): 38,090గా ట్రేడ్ అయింది.
gold Price on august 28 | ధరలు ఎలా ఉన్నాయంటే..
పసిడికి పెట్టుబడిదారుల ఆదరణ పెరగడంతో పాటు డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణ భయాలు కూడా బంగారం ధరలు పెరగడంలో భాగం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగానే బంగారం ధరలు Gold Prices పెరుగుతున్న వేళ, దేశీయ మార్కెట్‌లో సైతం ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు(24,22,18 క్యారెట్ల పరంగా చూస్తే)..
- చెన్నైలో రూ. 1,02,450 – రూ. 93,910 – రూ. 77,710
- ముంబయిలో రూ. 1,02,450 – రూ. 93,910 – రూ. 76,840
- ఢిల్లీ: రూ. 1,02,600 – రూ. 94,060 – రూ. 76,960
- కోల్‌కతా: రూ. 1,02,450 – రూ. 93,910 – రూ. 76,840
- బెంగళూరు: రూ. 1,02,450 – రూ. 93,910 – రూ. 76,840గా నమోదైంది.
- ఇక హైదరాబాద్: రూ. 1,02,450 – రూ. 93,910 – రూ. 76,840
- కేరళ: రూ. 1,02,450 – రూ. 93,910 – రూ. 76,840
- పుణె: రూ. 1,02,450 – రూ. 93,910 – రూ. 76,840
- వడోదరా: రూ. 1,02,500 – రూ. 93,960 – రూ. 76,880
- అహ్మదాబాద్: రూ. 1,02,500 – రూ. 93,960 – రూ. 76,880గా ట్రేడ్ అయింది.
వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మాంద్యం సూచనలు, ద్రవ్య విధానాల మార్పులు ఇవన్నీ బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే అంశాలే. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం బంగారం కొనుగోలుదారులకు ఇది తగిన సమయమా.. అనే దానిపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాల పెట్టుబడి కోసం బంగారం గోల్డ్ బాండ్స్ Gold Bonds లేదా సిప్ మాదిరి రూపాల్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.