అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Gold Price | ఈ మధ్య బంగారం ధరలు(Gold Rates) పైపైకి వెళుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి ధర గణనీయంగా పెరుగుతూ రికార్డ్ స్థాయికి చేరుకుంది. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ, గత కొన్ని రోజులుగా మళ్లీ బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. పసిడి ప్రియులకు ఇది కొంత ఉపశమనంగా చెప్పుకోవాలి. మే 28వ తేదీన భారత్(India)లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం రేట్లు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.9,747లు కాగా, అదే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.8,934లుగా ఉంది. ఇకపోతే, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.7,310లుగా ఉంది.
Gold Price | ఆలస్యం వద్దు..
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,650 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల రేటు రూ.95,500గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500.
ఇక విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,340, 24 క్యారెట్ల ధర రూ.97,470గా ఉంది. ఇకపోతే, నేటి వెండి ధర గ్రాము రూ.110.90లు కాగా, కిలో వెండి ధర రూ.1,10,900లుగా ఉంది. నిన్న మహానగరంలో.. కేజీ వెండి ధర 1,09,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు రూ.100 రూపాయలు తగ్గింది.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత బంగారం ధరల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అంతకు ముందు లక్ష రూపాయలకు చేరిన బంగారం ధరలు.. యుద్ధం తర్వాత క్రమంగా తగ్గుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 96 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. పరిస్థితులను చూస్తుంటే ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. బంగారం కొనాలనుకునే వారు.. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు.