అక్షరటుడే, వెబ్డెస్క్: Gold and Silver Rates | భారతీయుల జీవితాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ఏళ్లుగా పసిడి మన సంప్రదాయాల్లో భాగమైపోయింది. పేదల నుంచి ధనికుల వరకు ఏ శుభకార్యం జరిగినా బంగారు ఆభరణాలు ఉండాల్సిందే అన్న భావన బలంగా ఉంది.
బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు, అవసర సమయంలో ఆర్థిక భద్రతగా ఉపయోగపడే పెట్టుబడిగా కూడా మారింది. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు అది అందనంత దూరంగా మారింది. ఏడాది క్రితం వరకు లక్ష రూపాయల లోపే ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు లక్షన్నర దాటడం గమనార్హం.
Gold and Silver Rates | స్థిరంగా ధరలు..
ఇటీవలి నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, డాలర్ Dollar విలువ, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి కారణాలతో పసిడి ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.
నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు బంగారం ధరలుఎలా ఉన్నాయంటే.. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈ రోజు (ఆదివారం) బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్నటి ధరలే ఈరోజూ కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,56,600 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,43,550 వద్ద ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,17,450 వద్ద కొనసాగుతోంది.
వినియోగదారులకు కాస్త ఊరట
ధరలు పెరగకపోయినా తగ్గకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోందని చెప్పాలి. అయితే ఈ స్థాయిలోనే ధరలు ఉండటం సాధారణ కుటుంబాలకు భారంగానే మారుతోంది. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. బంగారం మాదిరిగానే వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. నిన్న ట్రేడ్ అయిన ధరలే ఈరోజూ కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 2,85,000 వద్ద ఉంది. 100 గ్రాముల వెండి Silver ధర రూ. 28,500 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ఈ రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన ధరలు వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతున్నాయి. శుభకార్యాల సీజన్ ముందు ధరలు తగ్గుతాయా లేదా ఇంకా పెరుగుతాయా అన్నది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది.