అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gold Silver Price Drop | భారతదేశంలో శుభకార్యాల సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 19వ తేదీ నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెళ్లి వేడుకలు (Wedding Ceremonies) భారీగా జరగనున్నాయి. వచ్చే రెండు నెలల పాటు వివాహాలు , గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు పెద్ద ఎత్తున ఉండనున్నాయి.
సాధారణంగా ఈ సమయంలో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. శుభముహూర్తాల సీజన్ ప్రారంభానికి ముందే బంగారం, వెండి ధరలు (Silver Prices) తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు ఆనందం కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, డాలర్ మార్పిడి విలువల్లో మార్పులు వంటి కారణాలతో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా దిగివస్తున్నాయి.
Gold Silver Price Drop | స్వల్ప తగ్గుదల..
సోమవారం ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) సుమారు రూ.1,300 మేర తగ్గగా, కిలో వెండి ధర దాదాపు రూ.15 వేల వరకు పడిపోయింది. ఇదే ట్రెండ్ మంగళవారం కూడా కొనసాగింది. ఫిబ్రవరి 17 ఉదయం నమోదైన ధరల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధరలో సుమారు 90 డాలర్ల పతనం చోటుచేసుకుంది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ సుమారు 4,950 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల రికార్డు స్థాయిలకు చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా కిందకు దిగుతున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో కూడా ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,430 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,390 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,540 కాగా, 24 క్యారెట్ల ధర రూ.1,56,580 వద్ద ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.1,43,390 వద్ద, 24 క్యారెట్ల ధర రూ.1,56,430 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,67,900 వద్ద కొనసాగుతుండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,900గా నమోదైంది. మొత్తంగా చూస్తే శుభకార్యాల సీజన్ ముందు బంగారం, వెండి ధరలు తగ్గడం వినియోగదారులకు మంచి అవకాశం గా మారింది.