More
    HomeజాతీయంGold bond | పసిడి పరుగులు.. బాండ్ల మెరుపులు..

    Gold bond | పసిడి పరుగులు.. బాండ్ల మెరుపులు..

    Published on

    అక్షరటుడే వెబ్ డెస్క్: Gold bond | బంగారం(Gold) ధర ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. రోజుకో కొత్త రికార్డు new records సృష్టిస్తూ పైపైకి దూసుకెళ్లింది. దీంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. బంగారం కొనుగోలు చేసిన, బంగారం బాండ్‌(Bond)లలో పెట్టుబడులు పెట్టినవారికి నిజంగానే కనక వర్షం కురిపించింది. బంగారం ధరకు gold price అనుగుణంగా గోల్డ్‌ బాండ్లు gold bonds కూడా పెరగడంతో ఇన్వెస్టర్లు (Investors) సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Gold price | సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు..

    ప్రజలలో పొదుపు(Savings)ను ప్రోత్సహించడం, దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించడం ద్వారా దిగుమతులకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఆర్‌బీఐ(RBI) 2015 నవంబర్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల(Sovereign gold bonds)ను ప్రవేశపెట్టింది. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. సావరిన్‌ బాండ్లపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 2017 మే నెలలో జారీ చేసిన బాండ్ల మెచ్యూరిటీ (Maturity) తీరుతోంది.

    అప్పట్లో 999 స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారం ధరను gold price రూ.2,951గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో online కొనుగోలు చేసిన వారికి రూ.50 రాయితీ కూడా ఇచ్చారు. ఈ బాండ్ల bonds మెచ్యూరిటీ ఈనెల 9న తీరనుంది. ప్రస్తుతం బంగారం gold ధరననుసరించి గ్రాము ధరను రూ.9,486గా నిర్ణయించారు. అంటే అప్పట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ investe చేసిన వారికి ఇప్పుడు రూ.3 లక్షలపైనే రానున్నాయి. దీనికి గోల్డ్‌ బాండ్లపై gold bonds ఇచ్చే వడ్డీ అదనం. ఏటా 2.50 శాతం వడ్డీని ఆర్‌బీఐ చెల్లిస్తోంది.

    Gold price | భారమై నిలిపివేత..

    ఆర్‌బీఐ ఏ ఉద్దేశంతో సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ప్రవేశపెట్టిందో అది నెరవేరలేదు. పైగా సర్కారు(Government)కు అదనపు భారంగా మారింది. భౌతిక(Physical) బంగారం కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు బంగారం ధర రికార్డులు సృష్టిస్తూ పెరగడంతో బాండ్లపై చెల్లించాల్సిన మెచ్యూరిటీ మొత్తం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఈ స్కీమ్‌(Scheme)ను నిలిపివేయాలని భావించిన ఆర్‌బీఐ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఎస్‌జీబీ (SGB) ట్రాంచ్‌లను జారీ చేయలేదు. అంతకుముందు 2024 ఫిబ్రవరిలో ఎస్‌జీబీలను జారీ చేశారు. కాగా ఈ ఏడాది మార్చి 20 నాటికి 130 టన్నుల బంగారానికి సంబంధించిన ఎస్‌జీబీలున్నాయి. వీటి విలువ రూ. 67 వేల కోట్లు. కాగా ఏప్రిల్‌ ఒకటో తేదీన బంగారం​ గ్రాము ధర రూ. 9,284 గా ఉంది. ఈ లెక్కన మొత్తం రిడెంప్షన్‌ లియేబిలిటీ(Redemption Liability) రూ. 1.2 లక్షల కోట్లవుతుందని అంచనా.

    More like this

    CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి...

    Team India | టీమిండియాకి కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చేశారు.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | భారత క్రికెట్ ప్రేమికులకు తాజా అప్‌డేట్! టీమిండియా క్రికెట్ జెర్సీపై ఇకపై...

    Birkur | గుడి డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తా: బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు...