అక్షరటుడే, వెబ్‌డెస్క్: TODAY GOLD PRICE : అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి బంగారం ధర పెరిగితే మరోసారి తగ్గుతోంది. అయితే ఈ రోజు పసిడి Gold ప్రియులకి కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. అందుకు కారణం మే 21, 2025 ఉదయం నాటికి వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ గోల్డ్ రేటు(24 carat gold price) 10 గ్రాములకు రూ. 510 తగ్గిపోయి రూ.95,010 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు(22 carat gold price) 10 గ్రాములకు రూ. 87,090కు చేరుకుంది.ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 95,160గా ఉండగా, 22 క్యారెట్ పసిడి ధర రూ. 87,240గా ఉంది.
TODAY GOLD PRICE : తగ్గుదల..
ఇక చెన్నె, ముంబై, కోల్‌కతా, కేరళ, పూణేలో 24 క్యారెట్ పుత్తడి ధర(24 carat gold price) 10 గ్రాములకు రూ.95,010గా ఉండగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు(22 carat gold price) 10 గ్రాములకు రూ. 87,090 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో మే 21, 2025న ఉదయం ఢిల్లీలో కిలో వెండి Silver ధర రూ.1200 తగ్గిపోయి రూ.96,900 స్థాయికి చేరింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతిలో కేజీ వెండి ధర రూ.1100 తగ్గి రూ.1,07,900కు చేరుకుంది. మరోవైపు చెన్నై, కేరళ, భోపాల్ వంటి ప్రాంతాల్లో కూడా వెండి రేట్లు రూ.1,07,900 స్థాయికి చేరుకున్నాయి. దీంతోపాటు నోయిడా, నాసిక్, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై వంటి ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ. 96,900గా ఉంది.
అమెరికా డాలర్ US dollar బలపడడం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ మధ్య వివాహాలు అంతగా లేకపోవడం, పండుగలు కూడా లేని కారణంగా బంగారం డిమాండ్ తగ్గింది. ఈ క్రమంలోనే గత 10 రోజులలో బంగారం ధరలు సుమారు రూ.5,600 తగ్గాయి. భవిష్యత్తులో, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం, భారతదేశంలో India డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎవరికైన బంగారం కొనుగోలు చేయాలని అనిపిస్తే ఇలా తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవడం మంచిది.