Homeబిజినెస్​Gold rates | బాబోయ్.. రూ. ల‌క్ష‌కు చేరువ‌వుతున్న బంగారం ధ‌ర‌.. ఇలా అయితే కొనేదెలా..!

Gold rates | బాబోయ్.. రూ. ల‌క్ష‌కు చేరువ‌వుతున్న బంగారం ధ‌ర‌.. ఇలా అయితే కొనేదెలా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold rates | బంగారం Gold ధరలు రోజురోజుకు ఎగబాకుతుండ‌డం కాస్త ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. తాజాగా నిన్న రూ.98,850 ఉన్న బంగారం ధర ప్రస్తుతం లక్షకు చేరువలో ఉండ‌డం గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది. జూన్‌ 4 బుధవారం రూ.99,070 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే రూ. లక్షా 200 రూపాయలు ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు చూస్తే..చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది.

Gold rates | పెరిగిన ధ‌ర‌లు..

ముంబైలో Mumbai 24 క్యారెట్ల(24-carat) 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది. ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,960 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల(24 carat) 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర రూ. 90,810 ఉంది. బెంగళూరు(Bangalore)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తున్నాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ధ‌ర‌లు మారుతూ ఉన్నాయి.