అక్షరటుడే, హైదరాబాద్: Gold prices | అక్టోబరు 7న బంగారం, వెండి రెండూ రికార్డు స్థాయిలో నిలిచాయి. నిపుణుల అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగితే బంగారం ధరలు రూ.1.25 లక్షలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే, డాలరు బలహీనత లేదా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే కొంత స్థిరత్వం కావచ్చని కూడా భావిస్తున్నారు. భారత మార్కెట్లో బంగారం ధరలు Gold Prices రోజు రోజుకీ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.
భౌగోళిక రాజకీయ Geopolitical ఉద్రిక్తతలు, అమెరికా డాలరు బలపడటం, అలాగే రూపాయి విలువ క్షీణించడం వంటివి పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
పెట్టుబడిదారులు గోల్డ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఈరోజు (అక్టోబరు 7, 2025) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
దేశవ్యాప్తంగా బంగారం gold రేట్లు మరోసారి రికార్డులు బద్దలు కొట్టాయి. 24 క్యారెట్ బంగారం 24 carat gold (10 గ్రాములు) .. రూ. 1,20,780 కాగా, 22 క్యారెట్ బంగారం 22 carat gold (10 గ్రాములు).. రూ. 1,10,710 గా ట్రేడ్ అయింది.
Gold prices | తగ్గేలా లేవుగా..
ఢిల్లీలో రేట్లు కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. 24 క్యారెట్ బంగారం ధర రూ. 1,20,930 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,10,860 గా ట్రేడ్ అయింది. ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) 24 క్యారెట్ , 22 క్యారెట్ పరంగా చూస్తే..
- హైదరాబాద్ రూ. 1,20,780 – రూ. 1,10,710
- విజయవాడ Vijaywada రూ. 1,20,780 – రూ. 1,10,710
- ఢిల్లీలో రూ. 1,20,930 – రూ. 1,10,860
- ముంబయిలో రూ. 1,20,780 – రూ. 1,10,710
- వడోదరలో రూ. 1,20,830 – రూ. 1,10,760
- కోల్‌కతా Kolkata లో రూ. 1,20,780 – రూ. 1,10,710
- చెన్నైలో రూ. 1,20,780 – రూ. 1,10,710
- బెంగళూరులో రూ. 1,20,780 – రూ. 1,10,710
- కేరళలో రూ. 1,20,780 – రూ. 1,10,710
- పుణెలో రూ. 1,20,780 – రూ. 1,10,710
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు) Silver Prices ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్ లో రూ. 1,67,100
- విజయవాడ లో రూ. 1,67,100
- ఢిల్లీ లో రూ. 1,56,100
- చెన్నైలో రూ. 1,67,100
- కోల్‌కతాలో రూ. 1,56,100
- కేరళలో రూ. 1,67,100
- ముంబయిలో రూ. 1,56,100
- బెంగళూరులో రూ. 1,56,100
- వడోదర లో రూ. 1,56,100
- అహ్మదాబాద్ లో రూ. 1,56,100 గా ట్రేడ్ అయింది.
అమెరికా, యూరప్ ప్రాంతాల్లో జియోపాలిటికల్ టెన్షన్‌లు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ముందు రోజుతో పోల్చితే కిలోకు రూ.100 వరకు పెరిగాయి.