Homeబిజినెస్​Gold Rates | ప‌సిడి ప్రియుల‌కి మళ్లీ షాకిస్తున్న బంగారం ధ‌ర‌లు..

Gold Rates | ప‌సిడి ప్రియుల‌కి మళ్లీ షాకిస్తున్న బంగారం ధ‌ర‌లు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం Gold ధ‌ర‌లు మ‌ళ్లీ చుక్క‌లు చూపిస్తున్నాయి. బంగారం కొనాల‌ని అనుకుంటే వారికి గుండెల్లో దడ పుట్ట‌డం ఖాయం. ఊహించ‌ని విధంగా గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

Gold Rates | భ‌గ్గుమంటున్న బంగారం..

నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,600 దగ్గర ట్రేడ్ కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,300 దగ్గర ట్రేడ్ అయింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74,700 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై ఏకంగా 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ.99610 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91310 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.74 710 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ ధ‌ర‌లు ప్రాంతాన్ని బ‌ట్టి మారే అవ‌కాశం ఉంది. హైద‌రాబాద్ Hyderabad, బెంగూళురు, చెన్నై, ముంబైల‌లో ధ‌ర‌ల‌లో కాస్త వ్య‌త్యాసం ఉంటుంది.

ఇక వెండి విషయానికి వస్తే.. నిన్న 100 గ్రాముల వెండి ధర రూ.11,100 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర రూ.1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర 11,090గా ఉంది.

Must Read
Related News